పులిజూదం సినిమా రివ్యూ

Published On: March 22, 2019   |   Posted By:

స్టార్స్ తో ఆమోదం (‘పులిజూదం’ సినిమా రివ్యూ) 

Rating: 2.5/5

స్టార్స్ తో సినిమా చేస్తే మామూలు కథ కూడా మహత్తరమైపోతుంది. అది చాలా మంది డైరక్టర్స్ కు తెలుసు. కాబట్టే ఏ హీరో లేని చోట కథే హీరో అంటారు కానీ స్టార్ ఉన్న చోట కథే జీరో అనేస్తారు. స్టార్స్ ఉన్నప్పుడు సాదా సీదా కథ కూడా సమర్దవంతమైన రచన అవుతుంది. మోహన్ లాల్, శ్రీకాంత్, విశాల్ వీళ్లు ముగ్గురుని సినిమాలో పెట్టుకున్నప్పుడు  వాళ్లను కలుపుకుంటే వెళ్లే సీన్స్ ఉంటే చాలు అనిపిస్తుంది. నిజానికి అలా ఉంటే చాలా? వీళ్ల ముగ్గురు కలిసి నటించిన పులి జూదం ఏం సమాధానం ఇస్తుంది. అసలు ఈ సినిమా కథ ఏంటి?మూడు భాషల జనాలను ఈ చిత్ర రాజం అలరిస్తుందా? వంటి విషయాలను రివ్యూలో చూద్దాం. 

స్టోరీ లైన్…

మాథ్యూ (మోహన్ లాల్) తన పర్శనల్ కారణాలతో వాలెంటరీ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటాడు. అయితే రిటైర్ అయ్యే రోజున ఓ మర్డర్ మిస్టరీ కేసు నమోదు అవుతుంది. ముగ్గురు ప్రముఖులు హత్య చేయబడ్డారు. మీడియా ప్రెజర్ చాలా ఉంటుంది. ఇలాంటి కేసులను సవాల్ గా తీసుకుని డీల్ చేసే మాథ్యూ వెళ్లిపోతానంటున్నాడు. దాంతో డీజీపి (సిద్దిఖీ) ఖచ్చితంగా ఈ కేసు డీల్ చెయ్యాల్సిందే అని మాథ్యూ ని పట్టుపడతాడు. సరే అని ఇన్విస్టిగేషన్ మొదలెట్టిన మాథ్యూ కు కొన్ని విచిత్రమైన విషయాలు ఈ క్రమంలో తెలుస్తాయి. తన సర్వీస్ నే సవాల్ చేసే విషయాలు చూసి అంతు తేల్చాలనుకుని మరింత లోతుకు వెళ్తాడు. అప్పుడు ఈ కేసులో డాక్టర్ దువ్వూరి మదనగోపాల్ (విశాల్) ప్రమేయం ఉందని తెలుస్తుంది. డ్రగ్ మాఫియా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉందని అర్దమవుతుంది.  ఇంతకి మదన్ గోపాల్ ఎవరు ?ఈ హత్యలు చేసిందెవరు ? మాథ్యూ ఎవరిని పట్టుకున్నాడు ? ఆయన రిటైర్ అవ్వటానికి ప్రధాన కారణం ఏమిటి ?  వంటి  విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చివరి వరకూ చూడాల్సిందే.

ఎలా ఉందంటే…

మళయాళంలో వచ్చిన  క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘విలన్’ కు ఇది డబ్బింగ్ వెర్షన్. రెండేళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా ఎందుకనో ఆపి ఆపి ఇఫ్పుడు రిలీజ్ చేసారు. వాస్తవానికి క్రైమ్ థ్రిల్లర్ అంటే మళయాళం వాళ్లు ముందుంటారు. దాంతో అక్కడ దర్శకుడు చేసిన క్రైమ్ థ్రిల్లర్ అంటే ఖచ్చితంగా ఆ జానర్ ని అభిమానించే వారికి అంచనాలు ఉంటాయి. వాళ్లను ఎంతవరకూ తృప్తి పరచగలదు అనే దానిపై ఆ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఎత్తుగడ బాగున్న ఈ సినిమా కథలోకి వెళ్లేసరికి ఆ స్పీడు తగ్గిపోయింది. దానికి తోడు విలన్ ఎవరో తెలిసిపోవటం, మోహన్ లాల్ ఆడే మైండ్ గేమ్ అతి మామూలుగా ఉండటం వంటి విషయాలు సినిమాను నీరసపరస్తాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే మళయాళ ఒరిజనల్ ని దాదాపు అరగంట ఎడిట్ చేసేసారు. దాంతో చాలా లింక్ లు నిర్ధాక్షణ్యంగా కట్ అయ్యిపోయాయి. వాటి ఇంపాక్ట్ కథనంపై పడింది. దానికి తోడు సినిమాలో ఎమోషన్ కంటెంట్ ఉంటే కట్టిపారేసేది. ప్యూర్ థ్రిల్లర్ గా మార్చాలన్న తపనతో దాన్ని మర్చిపోయారు. నిజానికి ఈ సినిమాని మొత్తం మోసింది మోహన్ లాల్. శ్రీకాంత్, విశాల్ ఉన్నా నామ మాత్రమే. అలాగని వాళ్ళు బాగా చేయలేదని కాదు. అంతకన్నా మోహన్ లాల్ చేసి వాళ్లను తినేసాడు. శ్రీకాంత్ విలనిజం కొన్ని సీన్స్ లో పూర్తిగా తేలిపోయింది.

 సాంకేతికంగా…

ఈ సినిమా టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లోనే ఉంది. థ్రిల్లర్ కు తగ్గ మూడ్ ని క్రియేట్ చేయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. అయితే అందుకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కలిసి రాలేదు. 

ఆఖరి మాట…

థ్రిల్ చేయాలంటే ఉండాల్సింది కథలో కొత్త మలుపులు కానీ కుప్పలు కొద్ది క్యారక్టర్స్ కాదు

నటీనటులు : మోహన్ లాల్, యాక్షన్ హీరో విశాల్, శ్రీకాంత్, హన్సిక, రాశీ ఖన్నా త‌దిత‌రులు.
సంగీతం : సుషిన్ శ్యామ్
స్క్రీన్ ప్లే : ఉన్నికృష్ణన్‌
ఎడిటర్ : సమీర్ మహమ్మద్
దర్శకత్వం : ఉన్నికృష్ణన్‌
నిర్మాత : రాక్ లైన్ వెంకటేశ్
Attachments area