పుష్కరం పూర్తిచేసుకున్న దేవదాసు

Published On: January 11, 2018   |   Posted By:
పుష్కరం పూర్తిచేసుకున్న దేవదాసు
 
ఇది అక్కినేని నటించిన దేవదాసు సంగతి కాదు. హీరో రామ్ నటించిన దేవదాసు మూవీ. రామ్ ను సిల్వర్ స్క్రీన్ కు హీరోగా పరిచయం చేసిన దేవదాసు సినిమా ఇవాళ్టితో 12 ఏళ్లు (పుష్కరం) పూర్తిచేసుకుంది. ఇదే సినిమాతో ఇలియానా హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయమైంది. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగునాట బ్లాక్ బస్టర్ విజయాన్నందుకుంది.
2006లో జస్ట్ 7 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 17 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఆ ఏడాది సంక్రాంతి బిగ్ హిట్ గా నిలిచి, రామ్ ను ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది. 17 థియేటర్లలో 175 రోజులాడింది దేవదాసు సినిమా. ఇదే ఒక రికార్డు అనుకుంటే, హైదరాబాద్ లోని ఓడియన్ థియేటర్లో 205 రోజులాడి సంచలనం సృష్టించింది.
చక్రి ఈ సినిమాకు అదిరిపోయే ట్యూన్స్ అందించాడు.