పూజా హెగ్డేకు బర్త్ డే విషెస్ చెప్పిన రాధే శ్యామ్ టీం

Published On: October 13, 2021   |   Posted By:

పూజా హెగ్డేకు బర్త్ డే విషెస్ చెప్పిన రాధే శ్యామ్ టీం

STORY PLAIN.jpg


ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న సినిమా రొమాంటిక్ బ్యూటిఫుల్ ఎంటర్ టైనర్ రాధే శ్యామ్. తాజాగా

ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదల అయింది. హీరోయిన్ పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు రాధే శ్యామ్ చిత్రయూనిట్. ఈ అద్భుతమైన ప్రేమ కథలో ప్రేరణ పాత్రలో నటిస్తున్నారు పూజ హెగ్డే. ప్రభాస్, పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. తెలుగు ఎఫ్ లో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప ప్రేమ కథలో రాధే శ్యామ్ కూడా ఉంటుందని నమ్మకంగా చెప్తున్నారు చిత్ర యూనిట్.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్, పూజా హెగ్డే మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు సినిమాకు ప్రాణం. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, అత్యద్భుతమైన సెట్లు.. అన్నింటినీ కలిపి రాధే శ్యామ్ సినిమాను ఎప్పటికీ మరిచిపోలేని ఒక గొప్ప ప్రేమ కథగా తెరకెక్కిస్తున్నారు రాధాకృష్ణ కుమార్.

జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలయిన రాధే శ్యామ్ గ్లింప్స్ అన్ని భాషల్లో రికార్డులు తిరగరాస్తుంది. లక్షల్లో లైకులు కోట్లలో వ్యూస్ వచ్చాయి. ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అనేది మరోసారి రాధే శ్యామ్ గ్లింప్స్ నిరూపించింది. ఈ సినిమాను రెబల్ స్టార్ కృష్ణంరాజు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌లో సమర్పిస్తుండగా.. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే.


టెక్నికల్ టీమ్: దర్శకుడు:రాధాకృష్ణ కుమార్.నిర్మాతలు : వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్. సంగీతం : జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథూన్, మనన్ భరద్వాజ్ (హిందీ)