పూరి కోసం బాల‌య్య

Published On: October 11, 2017   |   Posted By:

పూరి కోసం బాల‌య్య

నంద‌మూరి బాల‌కృష్ణ‌, పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం `పైసా వ‌సూల్‌`. బాల‌కృష్ణ న‌టించిన 101వ చిత్ర‌మిది. ఈ సినిమాతో బాల‌య్య‌, పూరి మ‌ధ్య మంచి రిలేష‌న్ ఏర్ప‌డింది. ఆ అనుబంధంతో నంద‌మూరి బాల‌కృష్ణ  పూరి జ‌గ‌న్నాథ్ సినిమా కోసం ముహుర్తం పెట్టాడ‌ట‌. జ్యోతిష్యాన్ని న‌మ్మే బాల‌కృష్ణ త‌న సినిమాల‌కు త‌నే ముహుర్తాల‌ను నిర్ణ‌యిస్తుంటాడు. తొలిసారి వేరే సినిమా కోసం బాల‌య్య ముహుర్తం పెట్టాడు. ఈ విష‌యాన్ని పూరియే తన సోష‌ల్ మీడియా అకౌంట్‌లో తెలియ‌జేశాడు. పూరి ద‌ర్శ‌త్వంలో, ఆయ‌న త‌న‌యుడు ఆకాష్ పూరి హీరోగా రూపొందుతోన్న చిత్రం `మెహ‌బూబా`. నేహాశెట్టి హీరోయిన్‌గా పరిచ‌యమ‌వుతుంది. ఇన్‌టెన్స్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కనున్న ఈ సినిమా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 8.20 నిమిషాల‌కు ప్రారంభ‌మైంది.