పెళ్లిపీట‌లెక్క‌నున్న నిఖిల్

Published On: August 8, 2017   |   Posted By:
పెళ్లిపీట‌లెక్క‌నున్న నిఖిల్
హ్యాపీడేస్ చిత్రంలో ఇంజ‌నీరింగ్ విద్యార్థిగా మెప్పించిన నిఖిల్ త‌ర్వాత అనుకున్న స్థాయిలో విజ‌యాల‌ను అందిపుచ్చుకోలేక‌పోయాడు.
అయితే స్వామిరారా సినిమాతో స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చాడు.కార్తికేయ సినిమా, సూర్య వ‌ర్సెస్ సూర్య‌, ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా, కేశ‌వ ఇలా వ‌రుస విజ‌యాల‌ను అందిపుచ్చుకున్నాడు.
ఇప్పుడీ యువ క‌థానాయ‌కుడు త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త‌న ద‌గ్గ‌ర బంధువైన తేజ‌స్వినితో పెళ్లి చేయ‌డానికి పెద్ద‌లు నిశ్చ‌యించార‌ట‌.
ఈ ఆగ‌స్టు 24న నిఖిల్‌, తేజ‌స్వినిల నిశ్చితార్థం జ‌ర‌గుతుంది. అక్టోబ‌ర్‌లో పెళ్లి జ‌రుగుతుంద‌ని అంటున్నారు