పెళ్లిపై మరింత క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య

Published On: September 11, 2017   |   Posted By:

పెళ్లిపై మరింత క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య

యుద్ధం శరణం సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్న నాగచైతన్య, తన పెళ్లిపై మరింత క్లారిటీ ఇచ్చాడు. అక్టోబర్ 6న సమంతను వివాహం చేసుకోబోతున్న నాగచైతన్య.. గోవాలో అత్యంత నిరాడంబరంగా పెళ్లి జరుగుతుందని చెప్పాడు. మొత్తంగా ఓ 20 మంది మాత్రమే పెళ్లిలో ఉంటారని కూడా క్లారిటీ ఇచ్చాడు.

“గోవాలో  చాలా సింపుల్ గా నేను, సమంత పెళ్లి చేసుకోబోతున్నాం. ఆర్భాటాలు నాకు నచ్చవు. అందుకే ఇంత సింపుల్ గా పెళ్లి. నా బెస్ట్ ఫ్రెండ్స్, బంధువులు మాత్రమే పెళ్లికి వస్తున్నారు. 6న హిందూ సంప్రదాయంలో, 7న క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకుంటాం. నాన్న బలవంతం మీద హైదరాబాద్ లో భారీ రిసెప్షన్ ఏర్పాటుచేశాం. సినీ, రాజకీయ ప్రముఖులంతా ఆ రిసెప్షన్ కు వస్తారు.” తన పెళ్లిపై నాగచైతన్య క్లారిటీ ఇది.

పెళ్లికి ముందే సవ్యసాచి సినిమాను స్టార్ట్ చేస్తానని ప్రకటించాడు చైతూ. ఈనెల 20న అక్కినేని జయంతి సందర్భంగా చందు మొండేటి దర్శకత్వంలో, మైత్రీ మూవీస్ బ్యానర్ పై సవ్యసాచి సినిమా షూటింగ్ ప్రారంభమౌతుందని తెలిపాడు. పెళ్లి తర్వాత ఈ సినిమా షూటింగ్ ను ఏకథాటిగా కొనసాగిస్తానని అంటున్నాడు నాగచైతన్య.