పెళ్లి కూతురు కానున్న ర‌జనీ హీరోయిన్‌

Published On: February 21, 2018   |   Posted By:

పెళ్లి కూతురు కానున్న ర‌జనీ హీరోయిన్‌

మ‌ద‌రాసు ప‌ట్ట‌ణం ద్వారా ద‌క్షిణాదిలోకి హీరోయిన్‌గా రంగ ప్ర‌వేశం చేసిన బ్రిట‌న్ బ్యూటీ ఎమీ జాక్స‌న్ త్వ‌ర‌లోనే త‌న ప్రియుడు జార్జ్‌ను పెళ్లి చేసుకోనుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. బ్రిట‌న్‌కు చెందిన వ్యాపార‌వేత్త జార్జ్‌, హీరోయిన్ ఎమీజాక్స‌న్‌ల మ‌ధ్య కొంత‌కాలంగా ప్రేమాయ‌ణం కొన‌సాగుతుంది. గ‌త ఏడాది జూన్‌లోనే వీరిద్ద‌రూ ఓ ఇంటివారు కావాల‌నుకున్నారు. అయితే ఎమీ జాక్స‌న్ బిజీ షెడ్యూల్ కార‌ణంగా కుద‌ర‌లేదు. అయితే ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోనుంది ఎమీ జాక్స‌న్‌. శంక‌ర్ ఐతో పాటు ప్ర‌స్తుతం రోబో సీక్వెల్ 2.0లో కూడా ఎమీ హీరోయిన్‌గా న‌టించింది. ఎవ‌డు, థెరి చిత్రాల్లో ఎమీ జాక్స‌న్ న‌టించింది.