పైసావ‌సూల్ చిత్రంలో బాల‌య్య రోల్ ఏoటoటే

Published On: August 31, 2017   |   Posted By:

పైసావ‌సూల్ చిత్రంలో బాల‌య్య రోల్ ఏoటoటే

నంద‌మూరి బాల‌కృష్ణ 101వ చిత్రంగా సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల‌కు సిద్ధ‌మైన చిత్రం `పైసావసూల్‌`. పూరి జ‌గ‌న్నాథ్ ఈసినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ట్రైల‌ర్‌, టీజ‌ర్‌లో బాల‌కృష్ణ మేన‌రిజ‌మ్‌, డైలాగ్స్ అన్ని కొత్త‌గా ఉండ‌టంతో సినిమాలో బాల‌య్య ఎలా క‌న‌ప‌డ‌తాడోన‌ని అభిమానులు, ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ కొంద‌రికి అందిన స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో బాల‌కృష్ణ క‌మెండో పాత్ర చేస్తున్నాడ‌ట‌. అయితే సినిమాలో ఈ పాత్ర రివీల్ సెకండాఫ్ త‌ర్వాతే ఉంటుంద‌ట‌. సినిమాలో బాల‌య్య క్యాబ్ డ్రైవ‌ర్ పాత్ర‌లో ద‌ర్శ‌న‌మిస్తాడ‌ట‌. ఈ చిత్రంలో శ్రియ‌, ముస్కాన్‌, కైరాద‌త్‌లు హీరోయిన్స్‌గా న‌టించారు. భ‌వ్య క్రియేష‌న్స్ ఆనంద ప్ర‌సాద్ సినిమాను నిర్మించారు.