పోస్టర్ సినిమా సెప్టెంబర్ విడుదల

Published On: September 3, 2021   |   Posted By:
 
పోస్టర్ సినిమా సెప్టెంబర్ విడుదల
 
 
సెప్టెంబర్ లో గ్రాండ్ గా “పోస్టర్” సినిమాను రిలీజ్ చేయనున్న యూ ఎఫ్ ఓ సంస్థ.! (UFO)
   
శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి. మహిపాల్ రెడ్డి (TMR) దర్శకుడిగా విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా “పోస్టర్”. ఇప్పటికే విడుదల అయిన  టీజర్, సాంగ్స్ ఈ సినిమా పట్ల సినీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొల్పిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ సంస్థ యూ ఎఫ్ ఓ (UFO) ఎంతో ప్రతిష్టాత్మకంగా, గ్రాండ్ గా అతి త్వరలో రిలీజ్ చేయనున్నారు.
  
ఇందులో భాగంగా చిత్ర దర్శకుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ యూ ఎఫ్ ఓ వంటి పెద్ద సంస్థ మా సినిమాను రిలీజ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది, అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది చిన్న సినిమాలలో  ఒక పెద్ద సినిమా అవుతుంది అనే నమ్మకం ఉంది. మా సినిమా రిలీజ్ లో మాకు ఎంతగానో సహకరిస్తున్న యూ ఎఫ్ ఓ సంస్థ యాజమాన్యానికి మరియు లక్ష్మణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు డైరెక్టర్ మహిపాల్ రెడ్డి. (TMR)
 
హీరో విజయ్ ధరన్ మాట్లాడుతూ: ఈ సినిమా మన వూరిలో మన ఇంటి పక్కన , మన ఫ్రెండ్స్ లో, మనకి జరిగిన కథ లాగే వుంటుంది. అన్ని ఎమోషన్స్ తో కూడిన చిత్రం లో నటించడం చాలా సంతోషంగా వుంది, UFO సంస్థ భాగస్వామ్యం టీమ్ కి మరింత ఎనర్జీ ఇచ్చినట్టు అయింది అన్నారు.     UFO సంస్థ నుండి లక్ష్మణ్ గారు మాట్లాడుతూ.. పోస్టర్ సినిమా అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని  రిలీజ్ కి సిద్దం గా వుంది. పరిస్థితులను పరిగణ లోకి తీసుకుని త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనున్నాము.
 
ఇందులో  శివాజీ రాజ, మధుమణి, రామరాజు, కాశీ విశ్వనాధ్,  స్వప్నిక, అరుణ్ బాబు జగదిశ్వరి వంటి నటినటులు నటించారు. ఈ సినిమాకు మాటలు నివాస్, సంగీతం శాండీ అద్దంకి, కెమెరా రాహుల్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్, నిర్మాతలు టి.శేఖర్ రెడ్డి, ఏ.గంగారెడ్డి,  మరియు ఐ.జి రెడ్డి. రచన–దర్శకత్వం టి.యం.ఆర్.