`ప్రాజెక్ట్ జెడ్` సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌

Published On: September 11, 2017   |   Posted By:

`ప్రాజెక్ట్ జెడ్` సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌

ఈ మ‌ధ్య టెక్నాల‌జీని బేస్ చేసుకుని సినిమాలు చాలానే వ‌స్తున్నాయి. మారుతున్న స‌మాజాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాల్లో క‌థా వ‌స్తువులు కూడా కొత్త‌గా పుడుతున్నాయి. మెయిల్ హ్యాకింగ్‌, అకౌంట్ హ్యాకింగ్‌, డ్రౌన్ మేకింగ్ వ‌ర‌కు.. ప‌లు సినిమాలు టెక్నాల‌జీల చుట్టూ తిరుగుతున్నాయి.

తాజాగా సందీప్ న‌టిస్తున్నా ప్రాజెక్ట్ జెడ్ కూడా టెక్నాల‌జీ బేస్డ్ సినిమానే. ఈ సినిమాలో సైన్స్ ఫిక్ష‌న్ ఎలిమెంట్స్ ప్ర‌ధానంగా సాగుతాయి. ఈ మ‌ధ్య యుద్ధం శ‌ర‌ణం అనే టెక్నాల‌జీ బేస్డ్ సినిమా చేసిన లావ‌ణ్య త్రిపాఠి ఈ తాజా సినిమాలోనూ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సి.వి.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డేనియ‌ల్ బాలాజీ, జాకీ ష్రాఫ్ ఈ సినిమాలో స‌పోర్టింగ్ పాత్ర‌ల్ని పోషించారు.

జిబ్ర‌న్ సంగీతం చేసిన ఈ సినిమా ఈ నెల 15న ప్రేక్ష‌కుల‌ముందుకు రానుంది. వ‌రుస‌గా తాను న‌టించిన సినిమాలు రెండు శుక్ర‌వారాల్లో విడుద‌ల కావ‌డం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేస్తోంది లావ‌ణ్య త్రిపాఠి.