ప్రీమియర్స్ లో సరికొత్త రికార్డు సృష్టించిన ఎన్టీఆర్

Published On: September 22, 2017   |   Posted By:

ప్రీమియర్స్ లో సరికొత్త రికార్డు సృష్టించిన ఎన్టీఆర్

ప్రీమియర్స్ లో సరికొత్త రికార్డు సృష్టించిన ఎన్టీఆర్.వసూళ్ల రికార్డుల కోసం ఇప్పుడు వీకెండ్ వరకు ఆగడం లేదు. ఇంకా చెప్పాలంటే మొదటి రోజు వసూళ్ల వరకు కూడా వెయిట్ చేయడం లేదు. ఎఁదుకంటే ఇప్పుడు ప్రీమియర్స్ లో ఎంత కలెక్ట్ అయిందనే విషయం కూడా ఓ రికార్డుగా మారింది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ ప్రీమియర్స్ లో ఎవరు ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత గొప్ప. ఇప్పుడిలాంటి “గొప్ప” రికార్డులోకి ఎన్టీఆర్ మరోసారి ఎంటరయ్యాడు

తాజాగా ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా అమెరికా ప్రీమియర్స్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. 189 లొకేషన్లలో ఈ సినిమా ప్రీమియర్స్ ను వేయగా..  159 లొకేషన్లకు చెందిన వసూళ్లు వచ్చాయి. ఈ మొత్తం కలుపుకుంటే 5 లక్షల 39 వేల డాలర్లు వచ్చాయి. టోటల్ గా చూసుకుంటే టాప్-10 ప్రీమియర్ వసూళ్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది జై లవకుశ. అలా ప్రీమియర్స్ ద్వారానే హాఫ్-మిలియన్ డాలర్లు ఆర్జించాడు ఎన్టీఆర్.

అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో మొదటి స్థానంలో బాహుబలి-2 నిలిచింది. రెండో స్థానంలో బాహుబలి-1 నిలవగా.. మూడో స్థానంలో ఖైదీ నంబర్ 150 ఉంది.