ప్రేమమ్ హీరోయిన్లతో నేచురల్ స్టార్ రొమాన్స్

Published On: August 8, 2017   |   Posted By:
ప్రేమమ్ హీరోయిన్లతో నేచురల్ స్టార్ రొమాన్స్
మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి. ఇప్పుడీ ఇద్దరు హీరోయిన్లపై నేచురల్ స్టార్ నాని కన్నేశాడు. ఇప్పటికే సాయి పల్లవిని తన కొత్త సినిమా కోసం తీసుకున్న ఈ హీరో, త్వరలోనే అనుపమను కూడా హీరోయిన్ గా తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు.
దిల్ రాజు బ్యానర్ లో ఎంసీఏ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఎంసీఏ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయ్ అని అర్థం. ఈ సినిమాలో ఫిదా ఫేం సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఫిదా సినిమాకు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడే సాయిపల్లవితో 2 సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నాడట నిర్మాత దిల్ రాజు. అందులో భాగంగా నాని సరసన సాయి పల్లవి నటిస్తోంది.
ఈ మూవీ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాని. ఈ సినిమాకు కృష్ణార్జున యుద్ధం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది.