ప్రేమ‌కోసం పోరాడే శ‌ర్వానంద్‌

Published On: February 8, 2018   |   Posted By:

ప్రేమ‌కోసం పోరాడే శ‌ర్వానంద్‌

ఫెస్టివ‌ల్ హీరోగా పేరు తెచ్చుకున్న శ‌ర్వానంద్ ఇప్పుడు హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో శ‌ర్వానంద్ ఓ సైనికుడి పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేద‌ట‌. ఇందులో శ‌ర్వానంద్ ప్రేమ కోసం పోరాడే యువ‌కుడిగా క‌నిపిస్తాడ‌ట‌. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి, ప్రసాద్‌ చుక్కపల్లి నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా సినిమా కోల్‌క‌తాలో స్టార్ట్ అయ్యింది. శ‌ర్వానంద్‌, సాయిప‌ల్ల‌విల‌పై కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ చిత్రానికి `ప‌డి ప‌డిలెచె లేచేను మ‌న‌సు` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది.