ప్ర‌భాస్‌కు హిందీ నేర్పుతున్న హీరోయిన్‌

Published On: December 26, 2017   |   Posted By:

ప్ర‌భాస్‌కు హిందీ నేర్పుతున్న హీరోయిన్‌…

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాె’. యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సుజిత్ దర్శకుడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో శ్రద్ధాకపూర్ టీచర్ అవతారం ఎత్తుతుందట. అది కూడా హిందీ టీచర్‌గా..ఇంతకీ ఎవరి కోసమోనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రభాస్ కోసమే. సెట్‌లో ఉన్నంత సేపు శ్రద్ధ..ప్రభాస్‌తో హిందీలోనే మాట్లాడుతుందని సమాచారం. ‘సాె’ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతుంది.