ప్ర‌భాస్ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్‌

Published On: April 19, 2018   |   Posted By:

ప్ర‌భాస్ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్‌

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’.  యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది.  భారీ బ‌డ్జెట్‌తో తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా రూపుదిద్దుకుంటోంది ఈ సినిమా. ప్రస్తుతం అబుధాబిలో యాక్షన్ సన్నివేశాలను అబుదాబీలో చిత్రీకరిస్తున్నారు. సినిమా వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విడుద‌ల‌కు ముందే సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుందనే సంగ‌తి తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో యే జ‌వానీ హై దివానీ, యారియాన్ చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ ఎలివ‌న్ శ‌ర్మ కూడా న‌టిస్తుంద‌ని స‌మాచారం