ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే

Published On: February 8, 2018   |   Posted By:

ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో పూజా హెగ్డే న‌టించ‌నుందా?… అంటే అవున‌నే అంటున్నాయి తెలుగు సినీ వ‌ర్గాలు. 2018 ఏడాది పూజా హెగ్డేకు బాగానే క‌లిసొచ్చిన‌ట్లు క‌న‌ప‌డుతుంది. ఎందుకంటే ఈ ఏడాది ముగ్గురు స్టార్ హీరోస్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని పూజా హెగ్డే అందుకోనుంది. వివ‌రాల్లోకెళ్తే.. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ 25వ చిత్రం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టించ‌నుంది. అలాగే ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ సినిమాలో కూడా పూజా హెగ్డే న‌టించ‌నుంది. కాగా ఇప్పుడు `జిల్‌` ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా చేయ‌బోయే సినిమా కోసం పూజా హెగ్డేతో యూనిట్ వ‌ర్గాలు సంప్ర‌దింపులు చేస్తున్నార‌ట‌. అన్నీ ఓకే అయితే పూజా బాహుబ‌లికి జంట‌గా న‌టిస్తుంద‌న్న‌మాట‌.