ప‌రుగులరాణిగా ప్రియాంక‌

Published On: October 5, 2017   |   Posted By:
ప‌రుగులరాణిగా ప్రియాంక‌
 
ప‌రుగులరాణిగా ప్రియాంక‌.స్పోర్ట్స్ ప‌ర్స‌న్స్ జీవితాల‌ను వెండితెర‌పై ద‌ర్శ‌కులు చూపిస్తున్న త‌రుణం ఈ ఏడాది ఎక్కువైంది. పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌, కపిల్‌ దేవ్‌, మన్మోహన్‌ సింగ్‌, సావిత్రి బయోపిక్‌లు రూపొందుతున్నాయి. తాజాగా ఈ లిస్టులో చేరింది ప‌రుగుల రాణి పి.టి.ఉష‌. ఈమె జీవితాన్ని బ‌యోపిక్ రూపంలో తెర‌కెక్కించ‌నున్నారు ద‌ర్శ‌కురాలు రేవ‌తి వ‌ర్మ‌. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు ఆంగ్లం, హిందీ, చైనీస్‌, రష్యన్‌ భాషల్లోనూ 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించ‌నున్నారు. గ‌తంలో లేడీ బాక్స‌ర్ మేరీ కోమ్ పాత్ర‌లో మెప్పించిన ప్రియాంక చోప్రా, ఇప్పుడు మ‌ళ్లీ పి.టి.ఉష పాత్ర‌లో క‌నిపించ‌నుందని స‌మాచారం. వ‌చ్చే ఏడాది ఈ సినిమా మొద‌లు కానుంది.