ప‌వ‌న్‌కి గ్లోబ‌ల్ ఎక్స‌లెన్స్ అవార్డు

Published On: November 18, 2017   |   Posted By:
ప‌వ‌న్‌కి గ్లోబ‌ల్ ఎక్స‌లెన్స్ అవార్డు
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని గ్లోబ‌ల్ ఎక్స‌లెన్స్ అవార్డు వ‌రించింది. ఇండియా యూరోపియ‌న్ బిజినెస్ ఫోరం ఆయ‌న‌కు ఈ అవార్డును అందించింది. లండ‌న్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ అవార్డును అందుకున్నారు. లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న అక్క‌డున్న అంబేద్క‌ర్ మెమోరియ‌ల్‌ను చూశారు. అక్క‌డ ఉన్న ఫొటోల‌ను తిల‌కించి ఆస్వాదించారు. శ‌నివారం ప‌లువురు విద్యార్థుల‌ను వెస్ట్ మినిస్ట‌ర్ ఎడ్యుకేష‌న్ సెంటర్‌లోని కింగ్స్ మెడిక‌ల్ కాలేజీలో క‌ల‌వ‌నున్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు `అజ్ఞాత‌వాసి` అనే పేరు పెట్టిన‌ట్టు స‌మాచారం. ఆయ‌న న‌టిస్తున్న మైల్‌స్టోన్ చిత్రం 25వ చిత్ర‌మిది. కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్ ఇందులో క‌థానాయిక‌లు. వ‌చ్చేనెల ఆడియో వేడుక జ‌ర‌గ‌నుంది. అనిరుద్ స్వ‌ర‌ప‌రిచిన పాట‌లు చాలా బాగా వ‌చ్చాయ‌ని ఈ ఆడియో రైట్స్ సొంతం చేసుకున్న ఆదిత్య మ్యూజిక్ సంబ‌ర‌ప‌డుతోంద‌ట‌. ఇటీవ‌ల విడుద‌లైన బ‌య‌టికొచ్చి చూస్తే పాట‌కు కూడా చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది.