ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ మూవీ రిలీజ్ డేట్‌?

Published On: August 7, 2017   |   Posted By:
ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ మూవీ రిలీజ్ డేట్‌?
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, స్టార్‌రైట‌ర్‌, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో అంటే సినిమాపై భారీ అంచ‌నాలుంటాయ‌న‌డంలో సందేహం లేదు. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి చేసిన జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు బాక్సాఫీస్ వద్ద క‌లెక్ష‌న్స్ వ‌ర్షాన్ని కురిపించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ ప్ర‌య‌త్నంగా వీరిద్ద‌రూ క‌లిసి చేస్తున్న సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.
ఈ చిత్రానికి ఇంకా  టైటిల్ అయితే ఫిక్స్ కాలేదు కాని.. రిలీజ్ డేట్‌ని సంక్రాంతికి అనుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. జ‌న‌వ‌రి 10 లేదా 11న ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుద‌లయ్యే అవ‌కాశం ఉంది. విశేష‌మేమిటంటే.. త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేస్తున్న తొమ్మిద‌వ సినిమా ఇది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా సంక్రాంతి బ‌రిలోకి రాలేదు. తొలిసారి త్రివిక్ర‌మ్ సినిమా సంక్రాంతి బ‌రిలోకి రానుండ‌టం అంద‌రిలో ఆస‌క్తిని క‌లిగిస్తుంది. మ‌రి త్రివిక్ర‌మ్‌కి ఈ సినిమా సంక్రాంతి ద‌ర్శ‌కుడిగా పేరు తెస్తుందేమో చూడాల్సిందే.