ప‌వ‌న్ కోసం అనూప్ మ్యూజిక్‌

Published On: March 13, 2018   |   Posted By:

ప‌వ‌న్ కోసం అనూప్ మ్యూజిక్‌

ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన `గోపాల గోపాల‌`, `కాట‌మ‌రాయుడు` సినిమాల‌కు అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి అనూప్, ప‌వ‌న్ కోసం సంగీతం అందిస్తున్నాడు. అయితే అది సినిమా కోసం కాదు. ప‌వ‌న్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ కోసం. `ఇంకెన్నాళ్లు ఈ గాయాలు…` అంటూ సాగే ఈ పాట‌లో స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ప్ప‌టి నుండి నేటి తెలంగాణ విభ‌జ‌న వ‌ర‌కు త‌లెత్తిన స‌మ‌స్య‌లు ప్ర‌భుత్వాల స్పంద‌న‌కు సంబంధించిన విజువ‌ల్స్‌ను ప్ర‌ద‌ర్శిస్తార‌ట‌.