ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త చిత్రం టైటిల్‌

Published On: August 16, 2017   |   Posted By:
ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త చిత్రం టైటిల్‌
ప‌వ‌ర్‌స్టార్‌ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకోనుంది. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ విష‌యంలో ముందు నుండి చాలా పేర్లు విన‌ప‌డ్డాయి. తాజా స‌మాచారం ప్రకారం ఈ చిత్రానికి `రాజు వ‌చ్చినాడు` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ట‌.
జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాల త‌ర్వాత ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో అభిమానుల్లో భారీ అంచ‌నాలున్నాయి. అల్రెడి బిజినెస్ విష‌యంలో కూడా సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్‌ను పూర్తి చేసుకుంద‌ట‌. ఈ సినిమాలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ పాత్ర‌లోక‌న‌ప‌డుతున్నాడు. ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.