ప‌వ‌న్ డేట్‌కే బ‌న్ని కూడా

Published On: August 16, 2017   |   Posted By:

ప‌వ‌న్ డేట్‌కే బ‌న్ని కూడా

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రం `నా పేరు సూర్య‌- నా ఇల్లు ఇండియా`. అనుఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఆగ‌స్ట్ 18 నుండి చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోవ‌డానికి సిద్ధ‌మైంది. శ‌ర‌త్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. యాక్ష‌న్ కింగ్ అర్జున్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ఏప్రిల్  27న విడుద‌ల చేయ‌డానికి యూనిట్ వ‌ర్గాల స‌న్నాహాలు చేస్తున్నాయి.

బ‌న్ని మూవీ రిలీజ్ డేట్‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఓ రిలేష‌న్ ఉంది. ఆ ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఏప్రిల్ 27న ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఖుషీ కూడా విడుద‌లైంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్‌లో సెన్సేష‌న‌ల్ మూవీగా నిలిచిన ఖుషీ విడుద‌ల తేదినే బ‌న్ని రావ‌డం చూస్తుంటే ప‌వ‌న్‌ను బ‌న్ని ఫాలో అవుతున్న‌ట్లే క‌దా. నా పేరు నా ఇల్లు ఇండియా సినిమాను వ‌క్కంతం వంశీ డైరెక్ట్ చేస్తుండ‌గా రామ‌ల‌క్ష్మి సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీషా శ్రీధ‌ర్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.