ప‌వ‌న్ విజ‌యం ద‌క్కించుకుంటాడా?

Published On: August 7, 2017   |   Posted By:
ప‌వ‌న్ విజ‌యం ద‌క్కించుకుంటాడా?
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే.. ఆయ‌న అభిమానుల్లోనే కాదు ప్రేక్ష‌కుల్లోనూ భారీ అంచ‌నాలుంటాయి. అందుకే ప‌వ‌న్‌ న‌టించిన సినిమాల‌కు టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం అద‌ర‌గొడ‌తాయి. అత్తారింటికి దారేది త‌రువాత సాలిడ్ హిట్ లేని ప‌వ‌న్‌కి ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కీల‌కంగా మారింది. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌తో ప‌వ‌న్ చేస్తున్న సినిమాతో అలాంటి విజ‌యం ద‌క్కుతుంద‌ని ఆయ‌న అభిమానులు ఆశిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. జ‌ల్సా, అత్తారింటికి దారేది త‌రువాత ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ క్రేజీ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న స‌ద‌రు చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంద‌ని స‌మాచారం. ఎటొచ్చి.. సంక్రాంతి సంద‌ర్భంగా వ‌చ్చిన ప‌వ‌న్ చిత్రాలు ఆశించిన స్థాయి విజ‌యాలు సాధించ‌లేద‌నే చెప్పాలి. 2005లో వ‌చ్చిన బాలు, 2015లో వ‌చ్చిన గోపాల గోపాల ఫ‌లితాలు ఫ‌ర‌వాలేద‌నిపించాయి. ఈ నేప‌థ్యంలో తాజా చిత్రం ఎలాంటి  ఫ‌లితం అందుకుంటుందో అన్న ఆస‌క్తి మొద‌లైంది. అస‌లే.. బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ కాబ‌ట్టి ప‌వ‌న్ ఈ సారి సంక్రాంతి హిట్ ద‌క్కించుకుంటాడని ఆశించొచ్చు.