“ఫస్ట్ ర్యాంక్ రాజు ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..!!

Published On: June 17, 2019   |   Posted By:

“ఫస్ట్ ర్యాంక్ రాజు ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..!!

చేత‌న్ మ‌ద్దినేని, క‌శిష్ ఓరా జంట‌గా  న‌రేష్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో డాల్ఫిన్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకం పై మంజునాధ్ వి.కందుకూర్ నిర్మిస్తున్న చిత్రం ” ఫ‌స్ట్ ర్యాంక్ రాజు”..  విద్య 100% బుద్ధి 0% అనేది ఉపశీర్షిక.. ఇటీవ‌లె విడుద‌లైన టీజ‌ర్ మ‌రియు పాట‌లు చాలా పెద్ద హిట్ అయి అద్భుత‌మైన స్పంద‌న ద‌క్కించుకోగా జూన్ 21న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.. ఈనేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించింది..

ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ సినిమా టీం అందరికి నా బెస్ట్ విషెష్.. కన్నడ లో మంచి విజయం సాధించిన ఈ సినిమా లో తెలుగులో కూడా అలాగే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. చేతన్ సినిమా సినిమా కి మంచి ఇంప్రూవ్ అవుతున్నాడు.. టైటిల్ లాగే సినిమా కూడా మంచి మార్కులు పొందాలని కోరుకుంటున్నాను అన్నారు.. 

డైరెక్టర్ మారుతీ మాట్లాడుతూ.. ఈ సినిమాకి చాల మంది హీరోలు అనుకున్నాప్రొడ్యూసర్ గారు చేతన్ కి సెలెక్ట్ చేసి అక్కడే ఫస్ట్ సక్సెస్ అయ్యారు.. ఈ పాత్ర కి చేతన్ తప్ప వేరెవరు న్యాయం చేసేవారు కారు, చాల పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోయాడు..మిగిలిన అందరు చాల బాగా నటించారు.. అందరు ఎంతో కష్టపడి ఈ సినిమా ని మంచి క్వాలిటీ గా తీశారు. ఈ సినిమా ద్వారా నిర్మాత మంజునాథ్ గారు, డైరెక్టర్ గారు నరేష్ గారు తెలుగులో కూడా మంచి మంచి సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నాను.. 

చిత్ర నిర్మాత మంజునాథ్ వి కందుకూర్ మాట్లాడుతూ .. సినిమా పట్ల ఉన్న ఫ్యాషనేట్ తోనే ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమా చేశాను.. తప్పకుండ ఒక మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా చేశాను. అందరు చాల మంచిగా ఆదరించారు.. ఇక్కడ చాల నేర్చుకున్నాను.. సినిమా గురించి మంచి ప్రమోషన్ ఇచ్చారు.. ఈ సినిమాని అందరికి నచ్చేలా తీశాం.. అందరు తప్పకుండా చూడండి.. అన్నారు.. 

దర్శకుడు నరేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, మారుతీ గారికి చాల థాంక్స్.. ఈ సినిమా కోసం కష్టపడినా అందరికి కృతజ్ఞతలు.. ఒక చిన్న ఐడియా తో మొదలైన ఈ సినిమా ఇంతవరకు వచ్చింది.. చాల హ్యాపీ గా ఉంది.. లైఫ్ లో ఒక్క విద్యనే కాదు బుద్ధి కూడా ఉండాలి.. అన్న మెసేజ్ తో ఈ సినిమా ఉంటుంది.. ఈ సినిమా ఎక్కడ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ని కించపరిచేలా ఉండదు.. ఈ సినిమా అందరు స్టూడెంట్స్ చూడాల్సిన సినిమా.. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది అన్నారు.. 

హీరోయిన్ కశీష్ వోహ్రా మాట్లాడుతూ.. నా కెరీర్ లో నేను చూసిన బెస్ట్ స్క్రిప్ట్ ఇది.. చాల మంచి రోల్ చేశాను.. ఈ పాత్ర కు నన్ను ఎంపిక చేసిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు.. ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది.. సినిమా ని అందరు చూసి విజయవంతం చేయాలి కోరుకుంటున్నాను అన్నారు.. 

హీరో చేతన్ మాట్లాడుతూ …. నాకీ అవకాశం ఇచ్చిన మంజునాథ్ గారికి చాల థాంక్స్.. సొంత కొడుకులా చూసుకున్నారు.. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది.. అయన తో మళ్ళీ మళ్ళీ సినిమా చేయడానికి రెడీ.. ఈ సినిమా కి సపోర్ట్ చేసిన అందరికి చాలా చాలా థాంక్స్.. పెద్ద పెద్ద ఆర్టిస్ట్స్ ఈ సినిమా కి డేట్స్ ఇచ్చి సినిమా కి సపోర్ట్ చేశారు.. స్క్రిప్ట్ ని నమ్మి చేసిన సినిమా ఇది.. మళ్ళీ అందరిని సక్సెస్ మీట్ లో కలుద్దాం.. మంచి కంటెంట్ ఉన్న సినిమా చూడనప్పుడు రొటీన్ సినిమాలు ఎందుకు వస్తున్నాయనే అర్హత లేదని నా నమ్మకం..