ఫస్ట్ వీకెండ్ లో అదరగొట్టిన రానా సినిమా  నేనే రాజు నేనే మంత్రి

Published On: August 16, 2017   |   Posted By:

ఫస్ట్ వీకెండ్ లో అదరగొట్టిన రానా సినిమా  నేనే రాజు నేనే మంత్రి

రానా-తేజ కలిసి హిట్ కొట్టారు. వీళ్లిద్దరి ఫ్రెష్ కాంబినేషన్ లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. వీకెండ్ కు తోడు హాలిడేస్ కూడా కావడంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరిగింది. ఎక్కువమంది ఈ సినిమా చూసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమా ఫస్ట్ వీకెండ్ నాటికి డీసెంట్ వసూళ్లు రాబట్టింది. పోటీలో నిలిచిన మిగతా సినిమాలతో పోలిస్తే మెరుగైన వసూళ్లు సాధించింది. శుక్ర, శని, ఆదివారాలు కలుపుకొని ఈ సినిమాకు వచ్చిన మొత్తం వసూళ్లు చూద్దాం. (ఇవి షేర్ లెక్కలు)

నైజాం – రూ. 3.44 కోట్లు

సీడెడ్ – రూ. 1.20 కోట్లు

ఈస్ట్  – రూ. 78 లక్షలు

వెస్ట్ – రూ. 40 లక్షలు

గుంటూరు – రూ. 62 లక్షలు

ఉత్తరాంధ్ర – రూ.1.18 కోట్లు

కృష్ణ –  రూ. 65 లక్షలు

నెల్లూరు – రూ. 28 లక్షలు

మొత్తం – రూ. 8.55 కోట్లు