ఫిదా మూవీ రివ్యూ

Published On: July 21, 2017   |   Posted By:

ఫిదా మూవీ రివ్యూ

Movie title:- Fidaa

Banner:- Sri Venkateswara Creations

Release date:-21.07.2017

Censor Rating:-“U”

Cast:- Varun Tej, Sai Pallavi, Saichand,Harshvardhan Rane,Sathyam Rajesh

Story:-Sekhar Kammula

Screenplay:-Sekhar Kammula

Dialogues:-Sekhar Kammula

Directed by:-Sekhar Kammula

Lyricists:- Suddala Ashok Tej,Sirivennela SeetharamaSastry,Vanamali, Chaitanya.

Music:- Shakti Kanth

Cinematography by :-Vijay C Kumar

Editing by:- Marthand K Venkatesh

Producer:- Dil Raju

Run Time:-145.35 minutes duration

 

Rating/రేటింగ్ : 3.5/5

మీరు శేఖర్ కమ్ముల సినిమాలకు అభిమానులా..? ఇంతకు ముందే మలార్ పాత్రలో సాయి పల్లవి చూసి ఆమెకు ఫ్యాన్ అయిపోయారా..? అయితే ఇది మీ సినిమా. మీ కోసమే పుట్టిన సినిమా. అవును.. ఫిదా సినిమా అటు కమ్ముల, ఇటు సాయి పల్లవి ఫ్యాన్స్ ను మతిపోయేలా చేస్తుంది. సినిమా మొత్తం వీళ్లిద్దరే కనిపిస్తారు.

కథ

అన్నయ్య కోసం చూసిన అమ్మాయిని, తను కూడా ఓసారి చూసి ఓకే చేద్దామని అమెరికా నుంచి బాన్సువాడకు వెళ్తాడు వరుణ్. అమ్మాయి చెల్లెలు సాయిపల్లవిని చూస్తాడు.మొదట ఇద్దరి మధ్య ఏం ఉండదు. తర్వాత కెమిస్ట్రీ డెవలప్ అవుతుంది. ప్రేమ పుడుతుంది. తన ప్రేమను వరుణ్ ఎక్స్ ప్రెస్ చేస్తాడు. కానీ సాయి పల్లవి మాత్రం రిజెక్ట్ చేస్తుంది. అమెరికా ఎపిసోడ్ తో దాదాపు ఇద్దరూ ఒకటవుతారు.

టెక్నీషియన్స్ పనితీరు

సింపుల్ గా చెప్పాలంటే ఫిదా ఇదే. కానీ సినిమాలో మాత్రం అంతకుమించి ఉంది. సినిమా స్టోరీ,దానికోసం అనుకున్న నటీనటులు, తీసుకున్న టెక్నీషియన్లు ఇలా చాలామంది ఫిదాకు హెల్ప్ అయ్యారు. మ్యూజిక్ డైరక్టర్ శక్తికాంత్ అయితే కమ్ముల స్టయిల్ లో హండ్రెడ్ పర్సెంట్ సింక్ అయిపోయాడు. మ్యూజిక్ మాత్రమే కాదు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కూడా కమ్ముల స్టయిల్ ను దించేశాడు శక్తికాంత్. కెమెరా వర్క్ బాగుంది. బాన్సువాడ, అమెరికాను చక్కగా ఎలివేట్ చేశారు. ఎడిటింగ్ ఫర్వాలేదు. స్క్రీన్ ప్లే బాగుంది. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

నటీనటుల పనితీరు

ఇక క్యారెక్టర్స్ విషయానికొస్తే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది భానుమతి గురించే. ఈ పాత్రను వందకు 2 వందల శాతం పండించింది హీరోయిన్ సాయి పల్లవి. ఈ సినిమా చూస్తే సాయిపల్లవికి ఎవరైనా ఫ్యాన్స్ అయిపోతారు. ఆమె లుక్స్ చాలా బాగున్నాయి. యాక్టింగ్ లో ఈజ్ మనల్ని కట్టిపడేస్తుంది. ఇక డాన్స్ అయితే కెవ్వు కేక. యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలా ఫిదా మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది సాయి పల్లవి.

హీరో వరుణ్ తేజ్ బాగా చేశాడు. కానీ చాలా చోట్ల అతడు లావుగా కనిపించాడు. బహుశా అవి యాక్సిడెంట్ అయిన తర్వాత తీసిన సన్నివేశాలు అయి ఉంటాయి. కొన్ని చోట్ల పవన్ కల్యాణ్ లా, చాలా చోట్ల నాగబాబులా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక గత సినిమాలతో పోలిస్తే ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ విషయంలో చాలా బెటర్ అనిపించుకున్నాడు. సినిమా మొత్తం హీరోయిన్ డామినేషన్ నడిచినప్పటికీ.. ఆడియన్స్ వరుణ్ తేజ్ గురించి కూడా మాట్లాడుకున్నారంటే అతడు కచ్చితంగా క్లిక్ అయినట్టే. హీరోహీరోయిన్లతో పాటు మిగతా సపోర్టింగ్ లీడ్స్ అంతా బాగా చేశారు.

బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ రివ్యూ

కేవలం శేఖర్ కమ్ముల సినిమాలు ఇష్టపడేవారికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా ఫిదా. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ సీన్స్, కామెడీ, సాంగ్స్.. ఇలా అన్నీ ఫిదాకు అద్భుతంగా కుదిరిపోయాయి. సింపుల్ గా చెప్పాలంటే “కమ్ముల ఈజ్ బ్యాక్” అనేలా ఉంది ఫిదా.

ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ కు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. లవ్ సీన్స్ కు యూత్ కనెక్ట్ అవుతుంది. ఇలా ప్రతి ఒక్కరికి నచ్చేలా కంప్లీట్ ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కింది ఫిదా.

కాకపోతే సినిమా మొత్తం తెలంగాణ స్టయిల్ లో సాగుతుంది. హీరోయిన్ తో పాటు దాదాపు అన్ని పాత్రలు తెలంగాణ యాసలోనే మాట్లాడతాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చుతాయి, ఎంత అర్థమౌతాయనేది ఆలోచించుకోవాలి. మరోవైపు సెకండాఫ్ లో కాస్త సాగతీత కూడా కనిపించింది. రెండో భాగాన్ని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఇలాంటి ఒకట్రెండు డ్రాబాక్స్ తప్పిస్తే, ఫిదాకు అడ్డుచెప్పడానికి ఏమీ లేదు. చక్కగా కుటుంబసభ్యులందరితో కలిసెళ్లి సినిమా చూడొచ్చు.

బాటమ్ లైన్

శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కలిసి మిమ్మల్ని ఫిదా చేస్తారు

 

రానా సినిమాకు ప్రభాస్ ప్రచారం
ఈ శుక్రవారం టాలీవుడ్ సినిమాలు