ఫిదా రికార్డులు –  2 మిలియన్ క్లబ్ లోకి చిన్న సినిమా

Published On: August 14, 2017   |   Posted By:

 ఫిదా రికార్డులు –  2 మిలియన్ క్లబ్ లోకి చిన్న సినిమా

ఊహించినట్టే ఫిదా సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. దీని విజయానికి గుర్తుగా ఓవర్సీస్ లో ఓ అరుదైన ఘనత దక్కించుకుంది ఫిదా సినిమా. కేవలం అతికొద్ది సినిమాలకు మాత్రమే సాధ్యమైన 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి దిగ్విజయంగా ఎంటరైంది ఈ సినిమా. నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఓవర్సీస్ లో ఫిదా సినిమాకు 2 మిలియన్ డాలర్లు (దాదాపు 13 కోట్ల రూపాయలు) వచ్చాయి. ఈ దెబ్బతో ఫిదా సినిమాకు బ్లాక్ బస్టర్ ట్యాగ్ లైన్ వచ్చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఇప్పటికీ మంచి వసూళ్లు వస్తున్నాయి. అయితే ఈ శుక్రవారం ఒకేసారి 3 పెద్ద సినిమాలు విడుదల కావడంతో ఫిదాకు కాస్త థియేటర్లు తగ్గాయి. అయినప్పటికీ ఆడియన్స్ వెతికి మరీ ఫిదా థియేటర్లకు చేరుకుంటున్నారు. అలా సక్సెస్ ఫుల్ గా నాలుగో వారంలోకి ఎంటరైంది ఫిదా.

తాజా ఓవర్సీస్ వసూళ్లతో.. నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకింది ఫిదా. ఈ లిస్ట్ లో అత్తారింటికి దారేది, గౌతమీపుత్ర శాతకర్ణి, జనతా గ్యారేజ్ సినిమాల్ని అధిగమించింది ఈ మూవీ. శేఖర్ కమ్ముల డైరక్ట్ చేసిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత.