ఫిదా సెకెండ్ ట్రయిలర్ రివ్యూ

Published On: July 18, 2017   |   Posted By:

ఫిదా సెకెండ్ ట్రయిలర్ రివ్యూ

మొదటి ట్రయిలర్ మెప్పిస్తే, తాజాగా విడుదలైన రెండో ట్రయిలర్ మైమరిపించింది. శేఖర్ కమ్ముల సిసలైన మార్క్ ను ఎలివేట్ చేసింది. మొదటి ట్రయిలర్ కు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా రెండో ట్రయిలర్ ను కట్ చేయించినట్టున్నాడు కమ్ముల. ఆ చమక్కులు, ఎమోషన్స్, ఫీలింగ్స్.. అన్నీ సెకెండ్ ట్రయిలర్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అంతిమంగా.. ఈ సెకెండ్ ట్రయిలర్ తోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఇలాంటి పాత్ర చేయడం వరుణ్ తేజ్ కు ఇదే ఫస్ట్ టైం. ట్రయిలర్ లో లవ్ ఫీలింగ్స్ ను పర్ ఫెక్ట్ గా పండించాడు వరుణ్. ఇక సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ట్రయిలర్ తోనే టోటల్ ఆడియన్స్ ను తనవైపు తిప్పుకుంది.  వరుణ్ తేజ్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుని, ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు.