ఫైనల్ షెడ్యూల్లో శుక్రా ప్రొడక్షన్ మూవీ

Published On: January 28, 2019   |   Posted By:

ఫైనల్ షెడ్యూల్లో శుక్రా ప్రొడక్షన్ మూవీ

ఫిబ్రవరి 4 నుండి ఫైనల్ షెడ్యూల్లో శుక్రా  ప్రొడక్షన్ మూవీ

కొత్తతరం ఆలోచనలకు దగ్గరగా ఉండే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిలబడతాయి అని చాలా సినిమాలు నిరూపించాయి. అలాంటి సబ్జెక్ట్ తో శుక్రా  ప్రొడక్షన్ బ్యానర్ లో  మిషాన్ జైన్,  హేమలతా రెడ్డి హీరో , హీరోయిన్లు గా రాబోతున్న చిత్రం టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసుకొని పాటలో చిత్రీకరణ కు సిద్దం అవుతుంది. కంటెంట్ ని బేసెడ్ సినిమాగా ఇండస్ట్రీ లో బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ సినిమా టైటిల్ ని త్వరలోనే ప్రకటిస్తామని ప్రొడ్యూసర్ సంజయ్ జాదవ్ తెలియజేసారు. ఈ సందర్బంగా దర్శకుడు వి ఎస్ ఫణీంద్ర మాట్లాడుతూ:యూత్ రిలేట్ అయ్యే అంశాలతో సినిమా రూపొందుతుంది.  అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకుంటాయి.  కథకు యూత్ బాగా రిలేట్ అవుతారు. ఇప్పటివరకూ వచ్చిన అవుట్ పుట్ చాలా సంతృప్తిగా ఉంది. సినిమా తప్పకుండా మంచి విజయం సాధింస్తుందనే నమ్మకం మా టీం కు ఉంది. హీరో, హీరోయిన్ల పాత్రలు చాలా బోల్డ్ గా ఉంటాయి. రాజా రవీంద్ర ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు.  సినిమా పిబ్రవరి 4నుండి ఫైనల్ షెడ్యూల్ కి వెళుతుంది. సినిమా తప్పుండా ఒక టాక్ ని క్రియేట్ చేస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంది’’ అన్నారు..

బ్యానర్: శుక్రా  ప్రొడక్షన్స్ 

హీరో : మిషాల్ సైలేష్ జైన్.హీరోయిన్  : హేమలతా రెడ్డి. ముఖ్యపాత్రలో  : రాజా రవీంద్ర.
సినిమాటోగ్రఫీ : జీ.కే. గోపీనాద్ కాకర్ల.మ్యూజిక్  : హార్ష ప్రవీణ్.ఎడిటర్  : రామారావు జే.పి.డిటియస్  5.1 : పద్మారావ్.ప్రొడ్యూసర్  : సంజయ్ జాధవ్కథ, దర్శకత్వం  : వీ. యస్. ఫణింద్ర