ఫోటోలపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్

Published On: September 12, 2017   |   Posted By:

ఫోటోలపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్

ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్ సినిమాతో పాటు మహానటి అనే మరో ప్రాజెక్టులో నటిస్తోంది కీర్తి సురేష్. నేను లోకల్ సినిమాతో టాలీవుడ్ లో కూడా పాపులర్ అవ్వడం, ఏకంగా పవన్ కల్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ రావడంతో ఇక్కడ కూడా ఆమెపై అందరి దృష్టి పడింది. ఇందులో భాగంగా తాజాగా కీర్తిసురేష్ కు చెందిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మరీ ముఖ్యంగా ఆ ఫొటోలు మహానటి సినిమాలోనివంటూ ప్రచారం కూడా జరిగింది. మహానటి సినిమాలో అలనాటి మేటి నటి సావిత్ర పాత్రలో కనిపించనుంది కీర్తిసురేష్. తాజాగా విడుదలైన స్టిల్స్ కూడా సంప్రదాయంగా ఉండడంతో.. ఆ ఫొటోల్ని మహానటి కోసం తీసిన స్టిల్స్ గా అంతా భావించారు. ఎట్టకేలకు వీటిపై వివరణ ఇచ్చింది ఈ బ్యూటీ.

వైరల్ అవుతున్న ఫొటోలకు, మహానటి సినిమాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది కీర్తిసురేష్. ఓ వాణిజ్య ప్రకటన కోసం తను అలా ట్రెడిషనల్ గా ముస్తాబయ్యాయని, సినిమా కోసం కాదని వివరణ ఇచ్చింది. సావిత్రి లుక్ ఇప్పటివరకు విడుదల కాలేదంటూ ట్వీట్ చేసింది కీర్తిసురేష్.