బన్నీ, కొరటాల కాంబినేషన్ లో చిత్రం

Published On: August 14, 2017   |   Posted By:

బన్నీ, కొరటాల కాంబినేషన్ లో చిత్రం

అన్నీ అనుకున్నట్టు జరిగితే కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఈ మేరకు సూత్రప్రాయంగా ఓ అగ్రిమెంట్ కుదిరినట్టు తెలుస్తోంది. తాజాగా జరిగిన సిట్టింగ్ లో బన్నీకి ఓ అదిరిపోయే స్టోరీలైన్ వినిపించాడట కొరటాల. అటుఇటుగా 30 నిమిషాల పాటు లైన్ వివరించినట్టు తెలుస్తోంది. స్టోరీ విన్న బన్నీ వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

ప్రస్తుతం కొరటాల శివ, మహేష్ తో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేస్తాడు. ఆ మూవీ కూడా కంప్లీట్ అయిన తర్వాత బన్నీతో సినిమా ఉంటుంది. సో.. వీళ్లిద్దరి కాంబో తెరపైకి రావడానికి కనీసం ఇంకో రెండేళ్లు పట్టేట్టుంది.

మరోవైపు బన్నీ కూడా బిజీ. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ లేదా లింగుస్వామి దర్శకత్వంలో ఓ మూవీ చేయాల్సి ఉంది. ఆ సినిమా కూడా కంప్లీట్ అయిన తర్వాత కొరటాల సినిమా సెట్స్ పైకి వస్తుందన్నమాట