బలమెవ్వడు టీజర్ విడుదల

Published On: September 18, 2021   |   Posted By:
 
బలమెవ్వడు టీజర్ విడుదల
 
 
ఇటీవలే కాలంలో అందరిలో ఎంతో ఆసక్తి ని కలిగిస్తున్న సినిమా బలమెవ్వడు. తాజాగా ఈ సినిమా కి సంబందించిన టీజర్ విడుదల అయ్యింది. ప్రేక్షకులను ఎంతో ఆసక్తి పరుస్తున్న ఈ టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో మంచి స్పందన దక్కించుకుంటుంది. ఈ టీజర్ లో కామెడీ, లవ్ స్టోరీ, మెడికల్ క్రైమ్ ను బాలన్స్ చేస్తూ ఒక పక్కా కమర్షియల్ చిత్రాన్ని తలపించేలా ఉంది.  సరికొత్త కథ కథనాలతో ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేసే ఎన్నో అంశాలు ఈ చిత్రంలో ఉన్నట్లు ఈ టీజర్ ను బట్టి తెలుస్తుంది. ది. ధృవన్ కటకం, నియా త్రిపాఠీ హీరో హీరోయిన్ లుగా  సత్య రాచకొండ దర్శకత్వంలో సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు నిర్మాతగా చేస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు టీజర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా లో  ఫృథ్విరాజ్, సుహసిని, నాజర్ వంటి సీనియర్ నటులు ముఖ్య పాత్రల్లో నటించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చారు. పెద్ద సినిమా లకు సరిసమానంగా మణిశర్మ ఈ సినిమా కి సంగీతం సమకూర్చడం విశేషం.ఈ సినిమా లో లెజెండరీ సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఓ పాట ఆలపించడం విశేషం. త్వరలోనే ఈ సినిమా కి సంబందించిన విడుదల తేదీ ని ప్రకటించనున్నారు మేకర్స్.
 
నటీనటులు 
 
ధృవన్ కటకం, నియా త్రిపాఠీ, ఫృథ్విరాజ్, సుహసిని, నాజర్, వివేక్ త్రివేది, అప్పారావు, ఐ  డ్రీమ్ అంజలి, మణి మహేష్, శ్రావణ్ భరత్
 
సాంకేతిక నిపుణులు 
 
సంగీతం – మణిశర్మ
సాహిత్యం – కళ్యాణ్ చక్రవర్తి
సినిమాటోగ్రఫీ – సంతోష్ శక్తి, గిరి.పి
ఎడిటర్- జెస్విన్ ప్రభు
ఫైట్స్ – శివరాజ్
కాస్ట్యూమ్స్ – హరీష రాచకొండ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ధృవన్ కటకం
నిర్మాత – ఆర్ బి మార్కండేయులు
రచన దర్శకత్వం – సత్య రాచకొండ