బాలీవుడ్‌కి మ‌ళ్లీ పూజా హెగ్డే

Published On: April 27, 2018   |   Posted By:

బాలీవుడ్‌కి మ‌ళ్లీ పూజా హెగ్డే

దక్షిణాది అమ్మాయి అయినా ముంబైలో పుట్టి పెరిగిన పూజా హెగ్డే దక్షిణాదిన హీరోయిన్‌గా రాణిస్తుంది. సాధారణంగా హీరోయిన్స్ అందరూ బాలీవుడ్‌లో రాణించాలని కలలు కంటుంటారు. అందుకు తగిన విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందరిలాగానే పూజా హెగ్డే కూడా బాలీవుడ్‌లో తన వంతుగా ప్రయత్నం చేసింది. హృతిక్‌తో పూజా హెగ్డే నటించిన ‘మొహంజోదారో’ ఆమెకు నిరాశనే మిగిల్చింది. దాంతో ఈ అమ్మడు మళ్లీ దక్షిణాది సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్, మహేశ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన ఈ అమ్మడు నటిస్తుంది. అయితే మళ్లీ పూజా హెగ్డేకు బాలీవుడ్ అవకాశం తలుపు తట్టింది. వివరాల ప్రకారం ‘హౌస్‌ఫుల్ 4’ లో నటిస్తుంది. ఇందులో కృతిసనన్ కూడా మరో హీరోయిన్‌గా నటిస్తుంది. హౌస్‌ఫుల్ 4 అయినా పూజాహెగ్డేను బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా నిలబెడుతుందేమో చూద్దాం.