బాలీవుడ్ విల‌న్‌తో బెల్లంకొండ‌  శ్రీనివాస్

Published On: March 14, 2018   |   Posted By:

బాలీవుడ్ విల‌న్‌తో బెల్లంకొండ‌  శ్రీనివాస్

యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు కొత్త ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెలాఖ‌రున ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. సినిమా లాంఛ‌నంగా ఇటీవ‌ల రామానాయుడు స్టూడియో ప్రారంభ‌మైంది. ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో విల‌న్‌గా నీల్ నితిన్ ముఖేష్ న‌టించ‌నున్నాడట‌. ప్ర‌స్తుతం నీల్ నితిన్‌.. ప్ర‌భాస్ సాహోలో న‌టించాడు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్‌, శ్రీవాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న `సాక్ష్యం` సినిమా మే 18న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.