బాల‌య్య‌తో బాలీవుడ్   హీరోయిన్‌

Published On: March 13, 2018   |   Posted By:

బాల‌య్య‌తో బాలీవుడ్   హీరోయిన్‌

నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడుత‌న తండ్రి, మాజీ ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ‌యోపిక్ “య‌న్టీఆర్‌`ను తెర‌కెక్కించే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఇందులో బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో న‌టిస్తుండ‌ట‌మే కాక‌..నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌తీమ‌ణిగా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై చాలా మంది హీరోయిన్స్ పేర్లు పరిశీల‌న‌లోకి వ‌చ్చాయి. నిత్యామీన‌న్‌ను కూడా యూనిట్ వ‌ర్గాలు సంప్ర‌దించాయి. అయితే నిత్య కొన్ని స‌మ‌స్య‌ల కార‌ణంగా న‌టించ‌న‌ని చెప్పేసింది. ఇప్పుడు ద‌ర్శ‌కుడు తేజ బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాల‌న్‌ను సంప్ర‌దించార‌ట‌. ఆమె కూడా దాదాపు ఎస్ చెప్పినట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి దీనిపై యూనిట్ వ‌ర్గాలు ఎలా స్పందిస్తాయో చూద్దాం.