బాల‌య్య‌తో మూడోసారి బోయ‌పాటి

Published On: December 6, 2017   |   Posted By:

బాల‌య్య‌తో మూడోసారి బోయ‌పాటి

బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బాల‌కృష్ణ కెరీర్‌లో పెద్ద విజ‌యాన్ని సాధించిన చిత్రాలుగా నిలిచిపోయాయి. మ‌ళ్లీ వీరి కాంబినేష‌న్‌లో సినిమాపై చాలా రకాలైన వార్త‌లు విన‌ప‌డుతూనే ఉన్నాయి. అయితే వ‌చ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ హిట్ ద్వ‌యం సినిమా స్టార్ట్ చేయ‌బోతున్నార‌నేది విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ సినిమా పొలిటిక‌ల్ నేప‌థ్యంలో సాగే చిత్రంగా ప్లాన్ చేస్తున్నార‌ట‌. 2019 ఎన్నిక‌ల నేప‌థ్యంలో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేలా కూడా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఈ లోపు బాల‌య్య త‌న `జై సింహా` చిత్రంతో పాటు తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను పూర్తి చేస్తార‌ట‌. అలాగే బోయ‌పాటి కూడా రామ్‌చ‌ర‌ణ్ సినిమాను పూర్తి చేసేస్తాడ‌ట‌.