బాహుబలి ప్లేస్ నుంచి బయటకొచ్చిన పవన్

Published On: July 25, 2017   |   Posted By:

బాహుబలి ప్లేస్ నుంచి బయటకొచ్చిన పవన్

బాహుబలి సినిమాను షూట్ చేసిన బల్గేరియా దేశానికి పవన్ కల్యాణ్ కూాడా వెళ్లిన విషయం తెలిసిందే.  త్రివిక్రమ్ దర్శకత్వంలో  పవన్ కల్యాణ్చేస్తున్న సినిమా కోసం ఓ షెడ్యూల్ ను అక్కడ ప్లాన్ చేశారు. తన కుటుంబంతో కలిసి బల్గేరియా వెళ్లిన పవన్ కల్యాణ్.. తాజాగా ఆ షెడ్యూల్ కంప్లీట్ చేశాడు. తిరిగి హైదరబాద్ వచ్చేశారు.

బల్గేరియా షెడ్యూల్ లో ఓ సాంగ్ తో పాటు, కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించారు. తిరిగి ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలోనే రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. ప్రస్తుతం యూనిట్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించింది. కొత్త షెడ్యూల్ వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిరుథ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.