బిగ్ బాస్ విజేత‌గా శివ‌బాలాజీ

Published On: September 25, 2017   |   Posted By:

బిగ్ బాస్ విజేత‌గా శివ‌బాలాజీ

తెలుగు బుల్లితెర‌పై తొలి రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఈ షోను యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌డంతో అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. ఓ పెద్ద ఇంట్లోకి కొంత మంది వ్య‌క్తులు వెళ‌తారు. వారికి ఈ బ‌య‌టి ప్ర‌పంచంతో సంబంధం ఉండ‌దు. ఇంట‌ర్నెట్‌, ఫోన్ ఇలాంటి సౌక‌ర్యాలు ఏవీ ఉండ‌వు. అడుగ‌డుగునా కెమెరాలు అమ‌రి ఉంటాయి. ఇలాంటి ఓ షోలో ఎవ‌రు విజేత‌గా నిలుస్తారోన‌ని ఓ ఆస‌క్తి అంద‌రిలో క్రియేట్ అయ్యింది.  తొలి సీజ‌న్‌లో  హ‌రితేజ‌, ఆదర్శ్‌, అర్చనా, శివ బాలాజీ, ముమైత్‌ఖాన్‌, ప్రిన్స్‌, సమీర్‌, సంపూర్ణేష్‌బాబు, కత్తి కార్తీక, ధన్‌రాజ్‌, మధుప్రియ, కల్పన, మహేష్‌ కత్తిలు పాల్గొన్నారు. ఇందులో ఆదర్శ్‌, అర్చనా, హరితేజ, శివబాలాజీ, నవదీప్‌లు ఫైన‌ల్ చేరారు. చివ‌ర‌కు బిగ్‌బాస్ విజేత‌గా శివ‌బాలాజీ రేసులో గెలిచాడు. విజేత‌కు 50 ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీన, ర‌న్న‌ర‌ప్‌గా ఆద‌ర్శ్ నిలిచారు.