బిజినెస్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న 2.0

Published On: July 18, 2017   |   Posted By:
బిజినెస్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న 2.0
రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 2.0. రోబో సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శంకర్ దర్శకుడు. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా వస్తున్న 2.0… ప్రీ-రిలీజ్ బిజినెస్ లో కూడా అదే భారీతనం చూపిస్తోంది. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రూపంలో ఇప్పటికే దాదాపు వంద కోట్ల రూపాయల్ని తన బ్యాగ్ లో వేసుకుంది.
మరోవైపు ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం భారీగా పోటీపడుతున్నారు. ఫ్యాన్స్ రేటుకు సినిమా రైట్స్ దక్కించుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు. సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చేందుకు, కేవలం ప్రచారం కోసమే 40 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తోంది సినిమా యూనిట్.
ఇప్పటికే 2.0 సినిమాకు సంబంధించి లాస్ ఏంజెల్స్ వద్ద హాట్ ఎయిర్ బెలూన్లను ఎగరేశారు. త్వరలోనే జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో కూడా వరల్డ్ టూర్ చేపట్టబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టాలనేది 2.0 యూనిట్ టార్గెట్.