బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది జనవరి విడుదల

Published On: December 24, 2020   |   Posted By:

బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది జనవరి విడుదల

జనవరి 1న షకలక శంకర్ ‘బొమ్మ అదిరింది.. దిమ్మ తిరిగింది’ విడుదల

షకలక శంకర్ హీరోగా కుమార్ కోట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బొమ్మ అదిరింది.. దిమ్మ తిరిగింది. ఔట్ అండ్ ఔట్ సస్పెన్స్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. షకలక శంకర్ కామెడీ టైమింగ్ ట్రైలర్‌లో ప్రధానాకర్షణ. మహాంకాళి మూవీస్, మణిదీప్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలపై మధు లుకాలపు, సోమేష్ ముచ్చర్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో షకలక శంకర్‌తో పాటు ప్రియ, అర్జున్ కళ్యాణ్, హీన, అవంతిక, రితికా చక్రవర్తి, రాజ్ స్వరూప్, మధు, సంజన చౌదరి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సస్పెన్స్ కామెడీగా వస్తున్న బొమ్మ అదిరింది.. దిమ్మ తిరిగింది సినిమా జనవరి 1న విడుదల కానుంది. పిఆర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఫణీంద్ర వర్మ అల్లూరి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

నటీనటులు:
షకలక శంకర్, ప్రియ, అర్జున్ కళ్యాణ్, హీన, అవంతిక, రితికా చక్రవర్తి, రాజ్ స్వరూప్, మధు, సంజన చౌదరి తదితరులు

దర్శకుడు: కుమార్ కోట
నిర్మాతలు: మధు లుకాలపు, సోమేష్ ముచ్చర్ల
సమర్పకుడు: మహాంకాళి దివాకర్
బ్యానర్స్: మహాంకాళి మూవీస్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్
కధ, మాటలు : వి.యస్.రావు.

సినిమాటోగ్రఫీ: ఫణీంద్ర వర్మ అల్లూరి
ఎడిటర్: శివ శర్వాని
సంగీతం: పిఆర్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్: భగవత్