బోయ‌పాటి రెండోసారీ బ‌లంగా హ్యాట్రిక్‌ కొట్టాడు

Published On: August 12, 2017   |   Posted By:
బోయ‌పాటి రెండోసారీ బ‌లంగా హ్యాట్రిక్‌ కొట్టాడు
మాస్ మ‌సాలా సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో బోయ‌పాటి శ్రీ‌ను స్టైలే వేరు. ఎంత రొటీన్ స‌బ్జెక్ట్‌ని ఎంచుకున్నా.. దానిని చూడ‌బుల్‌గా తెర‌కెక్కించి మాస్ ఆడియ‌న్స్ చేత హిట్ చేయించుకోగ‌ల‌డాయ‌న‌.
నిన్న‌నే విడుద‌లైన జ‌య‌జాన‌కి నాయ‌క విజ‌యమే ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌. ఈ సినిమాతో బోయ‌పాటి రెండోసారి హ్యాట్రిక్ కొట్టిన‌ట్ల‌య్యింది.  గ‌తంలో భ‌ద్ర‌, తుల‌సి, సింహా చిత్రాల‌తో ఓ హ్యాట్రిక్‌ని త‌న సొంతం చేసుకున్న బోయ‌పాటికి ఆ త‌రువాత వ‌చ్చిన ద‌మ్ముతో చుక్కెదురైంది. అయితే ఆ త‌రువాత విడుద‌లైన‌ లెజెండ్‌, స‌రైనోడు, జ‌య‌జాన‌కి నాయ‌క చిత్రాల‌తో మ‌రో హ్యాట్రిక్‌ని త‌న వ‌శం చేసుకున్నాడీ  మ‌..మ‌..మాస్ డైరెక్ట‌ర్‌. బి,సి సెంట‌ర్ల సాక్షిగా రెండోసారీ బ‌లంగా హ్యాట్రిక్ కొట్టిన బోయ‌పాటికి ఈ సంద‌ర్భంగా కంగ్రాట్స్ చెప్పాల్సిందే.