బ‌న్ని మూవీ మ‌ల‌యాళ టైటిల్‌

Published On: February 7, 2018   |   Posted By:

బ‌న్ని మూవీ మ‌ల‌యాళ టైటిల్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా చిత్రీక‌ర‌ణలో కాశ్మీర్ ఎల్‌.ఒ.సి ప్రాంతాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 27న ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్నారు నిర్మాతలు ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్‌, ల‌గ‌డ‌పాటి శిరీషా  శ్రీధ‌ర్ .  అయితే బ‌న్నికి తెలుగుతో పాటు మ‌ల‌యాళంలో కూడా మంచి మార్కెట్ ఉండ‌టంతో ఆయ‌న సినిమాల‌న్నీ మ‌ల‌యాళంలో కూడా విడుద‌ల‌వుతుంటాయి. ఈ మార్కెట్ దృష్ట్యా నిర్మాత‌లు ఈ చిత్రాన్ని తెలుగు, మ‌ల‌యాళంలో స‌మాంత‌రంగా విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌.  కాబ‌ట్టి ఈ సినిమా మలయాళం వెర్షన్ టీజ‌ర్‌ను (ఫ‌స్ట్ ఇంపాక్ట్‌) బుధ‌వారం (ఫిబ్ర‌వ‌రి 7) సాయంత్రం గం.4.30ని.లకు విడుదల చేయబోతున్నట్లు బన్నీ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియ‌జేశారు. అలాగే ఈ సినిమా పేరుని ‘ఎంటే పేరు సూర్య ఎంటే వీడు ఇండియా’ అని కూడా ఖరారు చేశారు.  ఆర్మీ నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ సైనికుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం -12 డిగ్రీల ఉష్ణోగ్రతలో బన్నీ నిజమైన సైనికుడిలా కష్టపడుతున్నారని చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో సీనియర్ నటులు అర్జున్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వక్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.