బ‌న్ని సినిమా కూడా అంతేన‌ట‌

Published On: April 23, 2018   |   Posted By:

బ‌న్ని సినిమా కూడా అంతేన‌ట‌

ఒక‌ప్పుడు తెలుగు సినిమా  నిడివి నాలుగు గంట‌లు ఉండేది. క్ర‌మంగా ఈ నిడివి త‌గ్గుతూ వ‌చ్చింది. కొన్ని నెల‌లు క్రితం వ‌ర‌కు తెలుగు సినిమా నిడివి ఎక్కువ అంటే 150 నిమిషాలు.. అంటే రెండున్న‌ర గంట‌లు మాత్ర‌మే ఉండేది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ ట్రెండ్ మారుతుంది. సినిమా నిడివి మూడు గంట‌ల‌కు ద‌గ్గ‌ర ప‌డుతుంది. అర్జున్ రెడ్డి సినిమా మూడు గంట‌ల నిడివితో విడుద‌లై మంచి స‌క్సెస్‌ను సాధించింది. త‌ర్వాత వ‌చ్చిన బాహుబ‌లి 2.. రంగ‌స్థ‌లం, రీసెంట్‌గా విడుద‌లైన భ‌ర‌త్ అనే నేను చిత్రాలు దాదాపు మూడు గంట‌ల నిడివితో సంద‌డి చేశాయి. అన్ని బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకున్నాయి.  ఇప్పుడు మే 4న రానున్న అల్లు అర్జున్ `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమా నిడివి రెండు గంట‌ల 47 నిమిషాలు ఉంటుంద‌ట‌. కంటెంట్ బ‌లంగా ఉంటే ప్రేక్ష‌కులు మూడు గంట‌ల సినిమాను చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌తార‌ని అంద‌రూ భావిస్తున్నారు.