బ‌హుబాషా చిత్రంలో స‌న్నీలియోన్‌

Published On: April 16, 2018   |   Posted By:

బ‌హుబాషా చిత్రంలో స‌న్నీలియోన్‌

గ్లామ‌ర్ తార స‌న్నీలియోన్ ఇప్పుడు వ‌డివుడ‌యాన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే మ‌రో ద‌క్షిణాది చిత్రంలో న‌టించ‌డానికి సిద్ధ‌మైంద‌ట‌. వివ‌రాల్లోకెళ్లే తెలుగు నిర్మాత మ‌ల్కాపురం శివ‌కుమార్ నిర్మాత‌గా రూపొంద‌బోయే సినిమాను క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ర‌ఘురాజ్ తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ చిత్రం తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో నిర్మితం కానుంది. రీసెంట్‌గా ద‌ర్శ‌కుడు స‌న్నీలియోన్‌ని క‌లిసి క‌థ‌ను వివ‌రించాడ‌ట‌. స‌న్నీలియోన్‌కు స్క్రిప్ట్ బాగా న‌చ్చింది. రివేంజ్ డ్రామాగా సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌కు వెళ్ల‌నుంది. ఇంత‌కు ముందు స‌న్నీలియోన్ తెలుగులో క‌రెంట్ తీగ‌, పిఎస్‌వి గ‌రుడ‌వేగ చిత్రాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టించింది.