భరత్ అనే నేను ఆడియో రైట్స్ వివరాలు

Published On: January 16, 2018   |   Posted By:

భరత్ అనే నేను ఆడియో రైట్స్ వివరాలు

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమా భరత్ అనే నేను. తాజాగా మూవీకి సంబంధించి ప్రీ-రిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా సినిమా ఆడియో రైట్స్ డీల్ క్లోజ్ అయింది. లహరి మ్యూజిక్ సంస్థ ఈ మూవీ ఆడియో రైట్స్ ను 2 కోట్ల రూపాయల భారీ మొత్తానికి దక్కించుకుంది. జీఎస్టీ కాకుండా ఇంత మొత్తానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంది లహరి సంస్థ. తాజాగా అగ్రిమెంట్ కూడా పూర్తయింది.
తెలుగులో అత్యథిక మొత్తానికి ఆడియో రైట్స్ అమ్ముడుపోయిన చిత్రాల్లో ఒకటిగా భరత్ అనే నేను నిలిచింది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ జనవరి 18 నుంచి మొదలవుతుంది. ఈ షెడ్యూల్ లో కీలకమైన క్లయిమాక్స్ పార్ట్ ను షూట్ చేయబోతున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.