భరత్ అనే నేను షూటింగ్ అప్ డేట్స్

Published On: March 13, 2018   |   Posted By:

భరత్ అనే నేను షూటింగ్ అప్ డేట్స్

మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది భరత్ అనే నేను సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పాటల షూటింగ్ కొనసాగుతోంది. అన్నపూర్ణ ఏడెకరాల్లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో హీరో మహేష్ బాబు, హీరోయిన్ కైరా అద్వానీపై ఓ సాంగ్ ను పిక్చరైజ్ చేస్తున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం సినిమా క్లైమాక్స్ కు వచ్చే సాంగ్ ఇది. రాజు సుందరం ఈ పాటకు కొరియోగ్రఫీ అందిస్తున్నాడు

ప్రస్తుతం నడుస్తున్న షెడ్యూల్ మరో 3 రోజులు కొనసాగుతుంది. తర్వాత యూనిట్ అంతా కలిసి విదేశాలకు వెళ్తుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో నిర్వహించనున్న మరో షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఏప్రిల్ మొదటివారానికి భరత్ అనే నేను షూటింగ్ పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న భరత్ అనే నేను సినిమాను ఏప్రిల్ 20న విడుదల చేయబోతున్నారు.