భరత్ అనే నేను సక్సెస్ మీట్ వాయిదా

Published On: April 26, 2018   |   Posted By:

భరత్ అనే నేను సక్సెస్ మీట్ వాయిదా

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం రికార్డు వసూళ్లతో ఈ సినిమా నడుస్తోంది. రీసెంట్ గా రంగస్థలం క్రియేట్ చేసిన కొన్ని రికార్డుల్ని కూడా ఇది అధిగమిస్తోంది. ఇంత పెద్ద విజయాన్ని కట్టబెట్టిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పేందుకు, సినిమా విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు యూనిట్ రెడీ అయింది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపు ఈ సినిమా సక్సెస్ మీట్ తిరుపతిలో జరగాలి. కానీ ఇప్పుడది వాయిదాపడింది. భరత్ అనే నేను సక్సెస్ మీట్ ను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మరో తేదీని, కొత్త వేదికను ప్రకటించబోతున్నారు. కేవలం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లనే పోస్ట్ పోన్ చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా విజయోత్సవ సభ డీటెయిల్స్ బయటకు రాబోతున్నాయి. యూనిట్ సభ్యులంతా ఇందులో పాల్గొంటారు.