భరత్ అనే నేను సెన్సార్ పూర్తి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం

Published On: April 16, 2018   |   Posted By:
భరత్ అనే నేను సెన్సార్ పూర్తి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం
మహేష్ బాబు, కొరటాల శివ కాంబోలో వస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ భరత్ అనే నేను. ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. ఎలాంటి కట్స్ లేకుండా సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ అధికారులు. దీంతో మూవీ రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. ఈనెల 20న భరత్ గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతున్నాడు.
ఈ సినిమాకు ఓవర్సీస్ లో భారీగా ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. దాదాపు 2000 స్క్రీన్స్ పై భరత్ అనే నేను సినిమా ప్రీమియర్ షోలు.. ఈనెల 19న యూఎస్ లో పడబోతున్నాయి. దీనికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే స్టార్ట్ కాగా, ఆల్ మోస్ట్ 90 శాతం బుకింగ్స్ క్లోజ్ అయ్యాయి కూడా. సెన్సార్ కంప్లీట్ అయింది కాబట్టి.. ఏపీ, నైజాంలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.
ఇంతకుముందు మహేష్-కొరటాల కాంబోలో శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. అందుకే భరత్ అనే నేను సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరీ ముఖ్యంగా సీఎంగా మహేష్ ను చూడాలనే ఆసక్తి ఆడియన్స్ లో బాగా ఉంది.