భాగమతి టీజర్ రివ్యూ

Published On: December 20, 2017   |   Posted By:
భాగమతి టీజర్ రివ్యూ

కొందరు సైన్స్ ఫిక్షన్ సినిమా అన్నారు. మరికొందరు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అన్నారు. ఇంకొందరు డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుందన్నారు. మొత్తానికి భాగమతి సినిమా ఏ జానర్ కు చెందినదనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఈరోజు ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఆ ఎక్స్ క్లూజివ్ టీజర్ రివ్యూ మీకోసం
పక్కా హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది భాగమతి సినిమా. ఇంకా చెప్పాలంటే అనుష్క నటించిన ఫుల్ లెంగ్త్ హారర్ సినిమా ఇదే. ఈ సినిమా కోసం భారీ భవంతి సెట్ వేశారు. ఆ భవంతినే టీజర్ లో చూపించారు. అనుష్క చేతికి మేకు కొట్టిన స్టిల్ ను ఫస్ట్ లుక్ లో చూపించారు. ఈ టీజర్ లో అనుష్క తనకు తానే చేతిలో మేకు కొట్టుకోవడం చూపించారు. టీజర్ లో హైలెట్ ఇదే. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ టీజర్ లో మిగతా హైలెట్స్.
ఈ ఒక్క టీజర్ తో భాగమతిపై అంచనాలు పెరిగాయి. ప్రభాస్ లాంటి హీరోలు ఈ టీజర్ ను ఇప్పటికే మెచ్చుకున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన భాగమతి సినిమాను జనవరి 26న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.