భాగమతి ఫస్ట్ డే వసూళ్లు

Published On: January 27, 2018   |   Posted By:
భాగమతి ఫస్ట్ డే వసూళ్లు
అనుష్క లీడ్ రోల్ లో నటించిన భాగమతి సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరుగా విడుదలైంది. జై సింహా, అజ్ఞాతవాసి, గ్యాంగ్ సినిమాలు థియేటర్లలో కొనసాగుతున్న వేళ.. ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లు దొరకలేదు. అయినప్పటికీ మొదటి రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల 16 లక్షల రూపాయల షేర్ వచ్చింది.
ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – రూ. 2.05 కోటి
సీడెడ్ – రూ. 0.68 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.60 కోట్లు
గుంటూరు – రూ. 0.50 కోట్లు
ఈస్ట్ – రూ. 0.41 కోట్లు
వెస్ట్ – రూ. 0.28 కోట్లు
కృష్ణా – రూ. 0.37 కోట్లు
నెల్లూరు – రూ. 0.27 కోట్లు
మొత్తం షేర్ – రూ. 5.16 కోట్లు